ఈ ప్రేమ తగ్గనిది! | CineChitram

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ‘దేవర’ ప్రస్తుతం ది మోస్ట్ ట్రెండింగ్ సినిమాగా అటు సోషల్‌ మీడియా, ఇటు ప్రింట్‌ మీడియాలో కూడా మారింది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ వదులుతూ మూవీ మేకర్స్ ప్రేక్షకులను ఎంగేజింగ్‌గా ఉంచుతున్నారు.

తాజాగా ఈ సినిమాలోని పలు మూవీ స్టిల్స్ వదులుతూ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేస్తున్నారు.ఇందులో భాగంగా ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ల ‘చుట్టమల్లె’ సాంగ్‌లోని ఓ స్టిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వెనకాల సముద్రం ఉప్పెంగేలా ఉన్నా, ఎన్టీఆర్-జాన్వీల ప్రేమ మాత్రం తగ్గదు అనేలా ఈ స్టిల్ ఉండటం యూత్‌ని బాగా ఆకర్షించింది.

ఇక ఈ సినిమాలో వీరి మధ్య రొమాన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించబోతున్నాడనే సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న గ్రాండ్ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.

The post ఈ ప్రేమ తగ్గనిది! first appeared on Andhrawatch.com.

About

Check Also

JAILER 2 – Announcement Teaser | CineChitram

The post JAILER 2 – Announcement Teaser first appeared on Andhrawatch.com.

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading