టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన తన తరువాత చిత్రంగా ‘టైసన్ నాయుడు’లో చేస్తున్నాడు. దీంతో పాటు ఓ భారీ అడ్వెంచర్ మూవీలోనూ ఆయన నటిస్తున్నాడు. ఇక ‘టైసన్ నాయుడు’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమాను దర్శకుడు సాగర్ కె చంద్ర పూర్తి రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ రస్టిక్ లుక్‌లోకి మారిపోయాడు. తాజాగా ఆయన లుక్‌కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ పోటోలు గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు.
యాక్షన్ సీక్వెన్స్‌లు హైలైట్‌గా తెరకెక్కుతున్న ‘టైసన్ నాయుడు’ మూవీలో అందాల భామలు నేహాశెట్టి, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.
The post ఈ లుక్ దేనికోసం శ్రీనివాసా…? first appeared on Andhrawatch.com.