పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న తాజా సినిమాల్లో డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న హారర్ కం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ “ది రాజా సాబ్” . మరి ఎప్పుడు నుంచో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా నిజానికి ఈపాటికే థియేటర్స్ లో ఈ సినిమా ఉండాల్సింది కానీ ఇంకా పలు పనులు పెండింగ్ ఉండటంతో వాయిదా పడింది.
ఇక ఈ చిత్రంపై మరో ఇంట్రెస్టింగ్ టాక్ ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ది రాజా సాబ్ సినిమా ఐమ్యాక్స్ వెర్షన్ సహా థియేటర్స్ లో 3డి వెర్షన్ లో కూడా విడుదల అవుతుంది అంటూ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని మారుతీ విఎఫ్ఎక్స్ కి పెద్ద పీట వేసి గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. సో ఎక్స్ పీరియన్స్ కూడా అదే లెవెల్లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారు కావచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.
The post ఈ వెర్షన్ కూడానా! first appeared on Andhrawatch.com.