ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పై దర్శకుడు రియాక్షన్‌ ఇదే! | CineChitram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. దీంతో తాను మొదలు పెట్టిన  సినిమాలు ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్నాయి. మరి ఉన్న గ్యాప్ లోనే పవన్ సినిమాలకి డేట్స్ ఇస్తూ కొంచెం కొంచెం పూర్తి చేస్తున్నారు. అయితే ఈ చిత్రాల్లో హరిహర వీరమల్లు అలాగే ఓజి సినిమాలపైనే అందరి దృష్టి ఉంది.

కానీ వీటితో పాటుగా పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా సెపరేట్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. యంగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ సినిమా మరింత సైలెంట్ గా ఉంది. దీంతో ఆ మధ్య చాలా పుకార్లు కూడా వచ్చాయి.

కానీ వాటిని మూవీ మేకర్స్ కొట్టి పారేసారు. అయితే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ పై దర్శకుడు రియాక్ట్ అయ్యారు.ఎలాంటి అప్డేట్స్ లేవు కనీసం ఈ కొత్త ఏడాది గిఫ్ట్ గా అయినా ఏదొక ట్రీట్ కోసం అడుగుతున్నా ఫ్యాన్స్ కి కచ్చితంగా మీరు వెయిట్ చేసే సమయం వర్త్ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కొంచెం సమయం తీసుకున్నా కూడా అదరగొడుతుంది అని చెప్పొచ్చు.

The post ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పై దర్శకుడు రియాక్షన్‌ ఇదే! first appeared on Andhrawatch.com.

About

Check Also

Amaran director reveals the genre of his next | CineChitram

Amaran is one film that has significantly impacted the global box office in recent times. …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading