ఎందుకు పక్కన పెట్టాడంటే! | CineChitram

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రెస్టీజియస్ సినిమా ‘పుష్ప-2’ గురించి ఇండియా వైడ్‌గా ఆడియెన్స్ ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను లెక్కల మాస్టర్‌ సుకుమార్ తెరకెక్కిస్తుండగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా అందరినీ అలరించనుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరింది.

కాగా, చిత్ర యూనిట్ ఈ చివరిదశ షూటింగ్‌ని ఎప్పుడెప్పుడు ముగిద్దామా అని ఎంతగానో కష్టపడుతున్నారు. అయితే, అల్లు అర్జున్ మాత్రం ‘పుష్ప-2’ చిత్రాన్ని పక్కకు పెట్టి మరో  ప్రాజెక్ట్ కోసం విరామం తీసుకున్నట్లు సమాచారం. ఇంతకీ బన్నీ అంత అర్జెంట్‌గా ‘పుష్ప-2’ని కాదని.. ఏ ప్రాజెక్ట్ కోసం వెళ్లాడా అని అనుకుంటున్నారా.. అయితే.. బన్నీ బ్రేక్ తీసుకుని వెళ్లింది సినిమా కోసం కాదు. ఓ యాడ్ షూట్ కోసం .

ప్రముఖ కూల్ డ్రింక్ కంపెనీ థంబ్స్ అప్ యాడ్ కోసం అల్లు అర్జున్ వెళ్లినట్లుగా సమాచారం. ఇక ఈ యాడ్ షూట్‌ని దర్శకుడు వివేక్ ఆత్రేయ తీర్చిదిద్దాడంట. ‘పుష్ప-2’ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

The post ఎందుకు పక్కన పెట్టాడంటే! first appeared on Andhrawatch.com.

About

Check Also

Ram Charan’s interesting comments on Game Changer | CineChitram

The global star Ram Charan has joined forces with the visionary director Shankar for a …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading