నటుడు అజయ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ లపై పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇంతకీ, అజయ్ ఏం మాట్లాడారు అంటే..’ఎన్టీఆర్ ఎప్పుడూ నన్ను డైరెక్టర్లకు ప్రిఫర్ చేస్తాడు. అలాగే మహేష్ బాబుగారు నాకు చాలా సినిమాల్లో అవకాశాలిచ్చారు. అతడు, పోకిరి సినిమాల కోసం త్రివిక్రమ్, పూరి జగన్నాధ్ కు నన్ను పరిచయం చేసింది మహేష్ గారే. అదేవిధంగా ప్రభాస్ కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు. ఇప్పుడున్న స్టార్ హీరోలంతా హీరోలుగా స్టార్ట్ అయినప్పుడు నేను వాళ్ల ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేస్తూ మొదలయ్యాను’ అంటూ అజయ్ చెప్పుకొచ్చాడు.
అజయ్ స్టార్ హీరోల గురించి ఇంకా మాట్లాడుతూ.. ‘నా స్టార్స్ తో నేను చాలా దగ్గర గా ఉంటాను. వారు కూడా నన్ను దగ్గర మనిషిగానే చూస్తారు. పైగా నాకు ప్రతి ఒక్కరితో లాంగ్ జర్నీ ఉంది. అందుకే, వారితో నాకు చనువు ఎక్కువ. కాకపోతే పైకి మాత్రం నేను పెద్దగా చెప్పుకోను’ అని అజయ్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. అన్నట్టు అజయ్ తెలుగు ఇండస్ట్రీకొచ్చి దాదాపుగా పాతికేళ్లు అవుతోంది. రీసెంట్ గా దేవర సినిమాలో అజయ్ కీలక పాత్రలో మెరిసాడు.
The post ఎన్టీఆర్…మహేశ్ నే! first appeared on Andhrawatch.com.