సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్’ అని ప్రచారం నడుస్తుంది. అయితే సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని, జనవరి 16 మంగళూరులో షూటింగ్ ప్రారంభం కానుందని తాజాగా రూమర్స్ వినపడుతున్నాయి. ఇంకా అధికారిక అప్ డేట్ రానప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త హల్‌చల్ చేస్తుంది.
పైగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో ‘ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్’ మూవీ ఎలా ఉండబోతుంది ? అంటూ తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్’ సినిమా గురించి నిత్యం ఏదొక రూమర్ వినపడుతూనే ఉంది.
The post ఎప్పటి నుంచి అంటే! first appeared on Andhrawatch.com.