బ్రహ్మానందం.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యావత్ తెలుగు సినీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలిగిన వ్యక్తులలో ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉంటారు. తన సినిమాలతో ప్రపంచ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న ఆయన తన సినీ కెరియర్లో ఎన్నో రకాల పాత్రలను పోషించాడు.
అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో బ్రహ్మానందం దుర్యోధనుని పాత్రలో అదిరిపోయారు. దాదాపు నిమిషం పాటు ఉన్న ఈ వీడియోలో బ్రహ్మానందం డైలాగ్స్ తో అదరగొట్టారు. ఇక ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..బ్రహ్మానందం కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఎలాంటి పాత్రనైనా చేయగలరని ఇదివరకే నిరూపించారు. ఇకపోతే తాజాగా ఆయన ‘ఉత్సవం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు సమాచారం.
దిలీప్, రెజీనా హీరో హీరోయిన్లుగా రాబోతున్న ఉత్సవం సినిమా నాటకాల ఆధారంగా తెరకెక్కించారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, మధుబాల, నాజర్ ఇలా ప్రముఖులు చాలామంది సీనియర్ యాక్టర్స్ వివిధ పాత్రలలో యాక్ట్ చేశారు. సినిమాకి సంబంధించి తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా అక్కడికి సినిమా నటీనటులందరూ వచ్చారు.
ఈ ఈవెంట్లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో బ్రహ్మానందం దుర్యోధన వేషంలో ఉన్న వీడియోని ప్లే చేయగా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. వీడియోలో దుర్యోధన వేషం వేసుకున్న ఆయన.. తన డైలాగ్ డెలివరీతో అదరగొట్టారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
The post ఎప్పుడూ కనిపించని పాత్రలో..హాస్య బ్రహ్మా! first appeared on Andhrawatch.com.