‘బలగం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా మారిన వేణు యెల్దండి, ఇప్పుడు తన తరువాత ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. మరోసారి పక్కా మాస్ అప్పీల్ ఉన్న కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ డైరెక్టర్ సిద్దమవుతున్నాడు. దీని కోసం ‘ఎల్లమ్మ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో ఓ సినిమాను తెరకెక్కించునున్నాడు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుండటంతో టాలీవుడ్‌లో అప్పుడే ఈ సినిమాపై ఓ రేంజ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో హీరోగా నితిన్‌ను కన్ఫార్మ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ సాయి పల్లవి ఫిక్స్ అయ్యిందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని.. అది నచ్చడంతోనే హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సినీ సర్కిల్స్‌లో నడుస్తున్న సమాచారం.
ఒకవేళ ఈ విషయం నిజమే అయితే సాయి పల్లవి ఈ సినిమాకు అంగీకరిస్తే కనుక నితిన్‌తో ఆమె తొలిసారి జోడీ కట్టబోతుంది. ఇక ఈ సినిమాను 2025 ప్రథమార్థంలో ప్రారంభించాలని చిత్ర బృందం అనుకుంటుంది.
The post ఎల్లమ్మగా సాయి పల్లవి! first appeared on Andhrawatch.com.