కోలీవుడ్ సినిమా నుంచి భారీ హైప్ సెట్ చేసుకున్న కొన్ని సినిమాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో చేస్తున్న భారీ చిత్రం “కూలీ” కూడా ఒకటి. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ కూడ దాదాపు అయిపోవస్తుంది. అయితే ఈ సినిమా పై ఇపుడు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దీనితో లోకేష్ కనగరాజ్ ఓ క్రేజీ సీక్వెన్స్ ని ఈ సినిమాలో డిజైన్ చేశాడట.
ఈ సినిమాకి తన గత సినిమాలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన సినిమాలకు ఎలాంటి లింక్ లేకపోయినప్పటికీ వాటిలో ఉన్నలాంటి కొన్ని సీన్స్ ని ఫున్ టైప్ లో చూపించి ఎంటర్టైన్ చేయనున్నాడు అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
The post ఏంటి సీక్వెన్స్ కూడానా! first appeared on Andhrawatch.com.