గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా సినిమా “గేమ్ ఛేంజర్” తర్వాత మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. తన కెరీర్ 16వ సినిమాగా దర్శకుడు బుచ్చిబాబు సానాతో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి మళ్ళీ సుకుమార్ కాంపౌండ్ నుంచే ఉన్న టీం తో ఈ సినిమా చేస్తుండడంతో పాజిటివ్ వైబ్స్ కూడా ఉన్నాయి.
అయితే గతంలో సుకుమార్, చరణ్ కలయికలో వచ్చిన “రంగస్థలం” నటుడు జగపతిబాబు ఈ మూవీలో కూడా సాలిడ్ రోల్ చేస్తుండగా తాను తాజాగా పెట్టిన పోస్ట్ మంచి ఆసక్తిగా మారింది. చాలా కాలం తర్వాత తనకి మంచి రోల్ పెట్టాడు బుచ్చిబాబు సానా. చరణ్ 16లో తన గెటప్ చూసాక చాలా తృప్తిగా అనిపించింది అంటూ తన మేకప్ రూమ్ నుంచి వీడియోతో ఓ పోస్ట్ చేశారు. దీంతో మళ్ళీ తన నుంచి చరణ్ సినిమాలో ఒక సాలిడ్ రోల్ రాబోతుంది అని తెలుస్తుంది.
The post ఏం చెప్పావ్ జగ్గూ భాయ్! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
