ఏ మాత్రం తగ్గని చరణ్‌ మేనియా! | CineChitram

టాలీవుడ్ ప్రౌడ్‌ హిట్ చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్‌” తో ఆ సినిమా హీరోలు అలాగే దర్శకుడు కూడా ప్రపంచ వ్యాప్తంగా  ఎలాంటి ఆదరణను అందుకున్నారో అందరికీ తెలిసిందే. అయితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని మాత్రం ఈ  సినిమా ఈ ట్యాగ్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గా మార్చింది అని చెప్పుకొవచ్చు.

ఈ సినిమా విడుదలైన తర్వాత విదేశీ ఆడియెన్స్ ఎంతోమంది చరణ్ పెర్ఫామెన్స్ కి అలాగే చరణ్ లుక్స్ కి అంతా ఫిదా అయిపోయారు. అలాగే జేమ్స్ కేమరూన్ లాంటి దర్శకుడు కూడా చరణ్ రోల్ కోసం సినిమాలో మాట్లాడ్డం కూడా జరిగింది. ఇలా ఎప్పటికప్పుడు చరణ్ పేరు మారుమోగుతునే ఉంది. అయితే లేటెస్ట్ గా మరోసారి చరణ్ పేరు వైరల్ అవుతుంది.

గత ఏడాదిలోనే ప్రముఖ విదేశీ స్టార్ ఫిక్స్ మ్యాగజైన్ పై చరణ్ ఫోటో మెయిన్ కవర్స్ లో ఒకటిగా వేసి బుక్ ని అనౌన్స్ చేసిన విజువల్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే దీనిని లేటెస్ట్ గా హాలీవుడ్ దర్శకుడు జురాసిక్ పార్క్ దర్శకుడు జోయీ జాన్ స్టన్ చదవడం ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో ఇలా మరోసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

The post ఏ మాత్రం తగ్గని చరణ్‌ మేనియా! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …