ఐఫా ఉత్సవం 2024 అబుదాబిలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి భారతదేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అనేకమంది హీరో హీరోయిన్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శుక్రవారం రాత్రి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగగా.. వివిధ కేటగిరీలలో సీనియర్ హీరోలు అవార్డులను అందుకున్నారు.
ఈ సందర్బంగా టాలీవుడ్ బడా హీరో నందమూరి నటసింహంగా పేరుపొందిన బాలకృష్ణ ” గోల్డెన్ లెగిసి” అవార్డును అందుకున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి అందుకున్న సమయంలో టాలీవుడ్ బడా హీరోలు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి ఒకే స్టేజిపై కనబడడంతో అభిమానులు తెగ ఆనంద పడిపోతున్నారు. అక్కినేని నాగార్జున కూడా ఉండి ఉంటే మరింత బాగుండేది అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు.
The post ఐఫా ఉత్సవంలో బాలయ్య బాబు సందడి! first appeared on Andhrawatch.com.