ఒక్కసారిగా “వీరమల్లు”పై అదిరిపోయే హైప్! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమాల్లో రెండు పాన్ ఇండియా సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాల్లో డైరెక్టర్ జ్యోతి కృష్ణతో చేస్తున్న భారీ సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఓ సినిమా.అయితే ఈ సినిమా ఎప్పుడో స్టార్ట అయినప్పటికీ ఇన్నేళ్లు అయిన కూడా షూటింగ్ దశలోనే మిగిలింది.
అయితే ఈ చిత్రానికి అప్పట్లో భారీ హైప్ ఉండేది. కానీ ఎప్పుడైతే “ఓజి” ప్రకటించడం జరిగిందో చాలా మంది ఆ సినిమాకి షిఫ్ట్ అయిపోయారు. దీంతో వీరమల్లు కంటే ఓజి ఇపుడు ఆఫ్ లైన్ లో ఫ్యాన్స్ నడుమ ఫస్ట్ ఛాయిస్ అయ్యిందని తెలుస్తుంది.
దీంతో వీరమల్లు పరిస్థితి ఏంటా అనే సమయంలో వచ్చిన ఫస్ట్ సింగిల్ ప్రోమో దాని రెస్పాన్స్ లు చూస్తే మాత్రం ఒక్కసారిగా మళ్ళీ హైప్ ని పెంచుకున్నాయని చెప్పాలి. దీంతో మెల్లగా ఓజి బ్యాచ్ కూడా వీర వైపు వస్తున్నట్లు తెలుస్తుంది. రెండు పవన్ సినిమాలే అయినప్పటికీ ఈ వ్యత్యాసం మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉందని తెలుస్తుంది.
The post ఒక్కసారిగా “వీరమల్లు”పై అదిరిపోయే హైప్! first appeared on Andhrawatch.com.