కన్నడ స్టార్ సుదీప్ హీరో గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘మాక్స్’. విజయ్ కార్తికేయ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. డిసెంబర్ 27న ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతుంది. తాజాగా యాక్షన్ తో నిండిన ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.
మ్యాక్స్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో సుదీప్ కనిపిస్తున్నారు. ఒక్కరాత్రిలో జరిగే కథ ఇది. ఓ అమ్మాయి కిడ్నాప్ కేసు, ఓ పొలిటికల్ లీడర్ ఇన్‌వ్వాల్మెంట్, చావుకి ఎదురెల్లి బాదితురాలిని కాపాడే పోలీస్.. ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన యాక్షన్ సీక్వెన్స్ లు హైలెట్ గా ఉన్నాయి.
వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు.‘సేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చే ప్రతి పకోడీ గాడు సమాజ సేవకుడే’ లాంటి పొలిటికల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. అజినీస్ లోక్ నాథ్ బీజీఎం యాక్షన్ ని ఎలివేట్ చేసింది. విక్రాంత్ రోణా తర్వాత సుదీప్ నుంచి చెప్పుకోదగ్గ సినిమా పడలేదు. ఆ మధ్య కాలంలో చేసిన కబ్జా సినిమా పూర్తిగా నిరాశ పరిచింది. మరి మ్యాక్స్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.
The post ఒక్క రాత్రిలోనే…మాస్ యాక్షన్! first appeared on Andhrawatch.com.