పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న తాజా సినిమాల్లో దర్శకుడు సుజీత్ తో చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “ఓజి” గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఎప్పుడు నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రం అన్నీ అనుకున్నట్టు జరిగి ఉండుంటే ఈరోజే సెప్టెంబర్ 27న థియేటర్స్ లో సందడి చేసేది.
మరి ఇదిలా ఉండగా పవన్ రీసెంట్ గానే సినిమా షూటింగ్ లో మళ్ళీ పాల్గొంటుండగా ప్రస్తుతం భారీ చిత్రం “హరిహర వీరమల్లు” లో పవన్ జాయిన్ అయ్యి ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత ఓజి షూటింగ్ కూడా అతి త్వరలోనే కానుందని తెలిసింది.
అయితే ఇప్పుడు మంగళగిరి, విజయవాడ ప్రాంతాల్లోనే పవన్ సినిమా షూటింగ్ చేస్తుండగా భారీ సెట్స్ అయితే పవన్ కోసం మూవీ మేకర్స్ అక్కడ వేశారు. కానీ ఇప్పుడు ఓజి పై ఓ విషయంలో మాత్రం చిత్ర బృందం టెన్షన్ పడుతున్నారు. ఓజి లో బ్యాంకాక్ లో ఓ కీలక ఎపిసోడ్ పవన్ పై షూట్ చేయాల్సి ఉంది. కానీ అది చేస్తున్నారా లేదా లేక ఇక్కడే సెట్టింగ్ వేసి కానిచ్చేస్తున్నారా అనేది ఇంకా రివీల్ కావాల్సి ఉంది.
పవన్ కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాగా దీనిని అభిమానులు భావిస్తున్నారు. అలాంటిది లొకేషన్స్ వేట చేసి కూడా అక్కడ షూటింగ్ చేయకుండా సెట్టింగ్స్ లో చేస్తే రియల్ ఫీల్ పోతుంది అని అభిమానులు అనుకుంటున్నారు.
The post “ఓజి” లో ఆ ఎపిసోడ్ సంగతేంటి మరి! first appeared on Andhrawatch.com.