అంతేకాదు.. మొన్న దేవర విడుదల అయిన డేట్ సెప్టెంబర్ 27న ఓజిని విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ పవన్ రాజకీయంగా బిజీ అవడంతో.. సినిమా షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా, ఏపి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్. ఇప్పటికే విజయ వాడలో హరిహర వీరమల్లు షూటింగ్ మొదలైంది. హైదరాబాద్‌లో రామోజీ ఫిలిం సిటీలో ఓజి షూటింగ్ మొదలు పెట్టారు కూడా. ప్రస్తుతం ఓజీకి సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు.
అయితే.. పవన్ ఇంకా ఈ షూటింగ్‌లో జాయిన్ అవలేదు. ఈలోపు పవన్ లేని సీన్స్ పూర్తి చేస్తున్నాడు సుజీత్. షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నారు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు.
అలాగే.. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టుగా మరో అప్డేట్ ఇచ్చారు.
The post ఓజీ ఆన్ షూట్! first appeared on Andhrawatch.com.