ఓటీటీలోకి మనమే! టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో చార్మింగ్ స్టార్ శర్వానంద్ కూడా ఒకరు. మరి శర్వా హీరోగా యంగ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ చిత్రం విడుదల అయ్యి దాదాపు 9 నెలలు అయ్యింది. ఇన్నాళ్లు అయ్యినా కూడా ఈ సినిమా ఇపుడు వరకు ఓటిటిలో రాలేదు. అయితే అప్పుడు ఓటిటి డీల్ సెట్ కాకపోవడం వల్లే రాలేదు అని టాక్ వచ్చింది. కానీ ఇపుడు ఫైనల్ గా మనమే ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రాన్ని సొంతం చేసుకోగా అతి త్వరలోనే ఈ చిత్రం అందులో రానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే డేట్ పై కూడా బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం మనమే ఈ మార్చ్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చే ఛాన్స్ ఉందట. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి హీషం అబ్దుల్ వహాద్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.
The post ఓటీటీలోకి మనమే! first appeared on Andhrawatch.com.