టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రయోగాత్మ సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అలా తను చేసిన తాజా సినిమా “మట్కా”. దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా విడుదలకి వచ్చింది. కానీ అనుకున్న రేంజ్ లో అయితే విజయాన్ని అందుకోలేదు.
ఇక థియేటర్స్ లో రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫైనల్ గా ఓటీటీ విడుదలకి వచ్చేసింది.ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న ఈ సినిమా నేటి నుంచి ఓటీటీలో పాన్ ఇండియా భాషల్లో వస్తుంది. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి అలాగే నోరా ఫతేహి నటించగా జీవీ ప్రకాశం సంగీతం అందించారు. అలాగే వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
The post ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన మట్కా! first appeared on Andhrawatch.com.