మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతగానో వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది దేవర సినిమానే. ఈ సినిమాని దర్శకుడు కొరటాల శివతో తన రెండో సినిమాగా చేసిన ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ అంచనాలను ఇప్పటికే ఏర్పరించింది. ఇక ఈ సినిమా నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న క్రేజీ ట్రైలర్ కట్ ని మేకర్స్ మంగళవారం విడుదల చేయగా దీనికి అనూహ్య స్పందన వచ్చిందనే చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా గ్లోబల్ ఆడియెన్స్ లో దేవర చూపించిన ఇంపాక్ట్ అయితే అదిరిపోయింది. ముఖ్యం ట్రైలర్ చివరి షాట్ సొర చేప మీద తారక్ ఓ కొరడా పట్టుకొని లేచిన సీన్ చూసిన వెస్ట్రన్ ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఆసక్తి చూపుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో పర్టిక్యులర్ గా ఈ ఒక్క షాట్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇలా మరోసారి తారక్ గ్లోబల్ ఆడియెన్స్ లో తన పేరు మోగేలా చేసాడు అని తెలుస్తుంది.
The post కట్టిపడేస్తున్న దేవర్ లాస్ట్ షాట్! first appeared on Andhrawatch.com.