సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్ శివారులోని జల్‌పల్లిలో ఉండే ఆయన నివాసంలో రూ.10 లక్షల దొంగతనం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా మోహన్ బాబు మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి తిరుపతిలో ఉన్న ఆ దొంగను పట్టుకున్నారు.
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు ఫిల్మ్ నగర్‌తో పాటు.. హైదరాబాద్ శివారు ప్రాంతం జల్‌పల్లిలో మరో ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో దొంగతనం జరిగినట్లు సమాచారం. రూ.10 లక్షలు చోరికి గురి అయినట్లు స్వయంగా మోహన్ బాబు రాచకొండ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లో దొంగతనం జరిగిందని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే ఎంక్వైరీ చేసి నాయక్ అనే వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డట్లు గుర్తించారు. నాయక్ కొన్నాళ్లుగా మోహన్ బాబు ఇంట్లో పని చేస్తున్న సంగతి తెలిసిందే. దొంగతనం చేసిన డబ్బు తో నాయక్ తిరుపతి పారిపోయాడు. అక్కడే పోలీసులు నాయక్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
The post కన్నప్ప ఇంట్లో కన్నం! first appeared on Andhrawatch.com.