దివంగత లెజెండరీ యాక్టర్ డా.అక్కినేని నాగేశ్వర రావు నేషనల్ అవార్డ్ ప్రధానోత్స కార్యక్రమం ఘనంగా జరుపుకుంటున్నారు. 2024 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డ్‌ని మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించారు.
అయితే, నేడు ఈ అవార్డ్ ప్రధానోత్సవాన్ని తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవికి బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందించారు.
ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసిన అమితాబ్ బచ్చన్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అమితాబ్ బచ్చన్ సినిమాలు చూస్తూ పెరిగాను.. తాజాగా వచ్చిన ‘కల్కి 2898 AD’లో అమితాబ్ బచ్చన్ నటన చూసి ఆయనకు వెంటనే ఫోన్ చేశానని.. మా ఒరిజినల్ మాస్ హీరో తిరిగి వచ్చారు.. అంటూ ఆయనకు ఫోన్ చేసిన చెప్పానని నాగార్జున అన్నారు.
తనకు ఎంతో ఇష్టమైన అమితాబ్ బచ్చన్‌ను ఇలా ‘కల్కి’ లాంటి సినిమాలో చూడటంతో అమితాబ్‌కి చెందిన పలు సినిమాలు తనకు గుర్తుకు వచ్చాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇలా అమితాబ్‌పై తన అభిమానాన్ని నాగ్ మరోసారి చాటుకున్నారు.
The post ‘కల్కి 2898 AD’లో కింగ్ నాగార్జున! first appeared on Andhrawatch.com.