టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ , యంగ్ టైగర్ఎ న్టీఆర్ హీరోగా ఇపుడు చాలా భారీ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ మూవీస్ లో బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీతో చేస్తున్న మూవీ వార్ 2 కూడా ఒకటి. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఎప్పటికప్పుడు పాల్గొంటున్న తారక్ తాజాగా మరోసారి ఆ సినిమా లుక్ లో కనిపించడం జరిగింది. అయితే ఈ క్రమంలో తారక్ లుక్ ఒకటి బయటకి రాగా దానితో పాటుగా తన చేతికి ధరించిన వాచ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా కనపడుతుంది.
అయితే ఈ వాచ్ ఏకంగా 7 కోట్లకి పైగా ఉంటుందని తెలుస్తుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ లగ్జరీ వాచ్ కంపెనీ అయినటువంటి రిచర్డ్ మిల్లీ నుంచి ఆర్ఎం 40-01 టర్బిలోన్ ఎడిషన్ గా సమాచారం. దీంతో ఈ వాచ్ మన దేశపు కరెన్సీలో సుమారు ఏడున్నర కోట్ల రూపాయలుగా ఉందంట. దీంతో తన వాచ్ కోసం ఇపుడు సోషల్ మీడియాలో అభిమానులు సహా బాలీవుడ్ వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నాయి.
The post కాస్ట్లీ వాచ్! first appeared on Andhrawatch.com.