పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అయ్యిన పలు చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ మూవీస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ ఎలివేషన్స్ కి పెట్టింది పేరుగా మారిపోయిన ఈ చిత్రాల ఫ్రాంచైజ్ లో పార్ట్ 3 పై కూడా భారీ హైప్ నెలకొంది.
మరి ఈ సినిమా విషయంలో కొన్నాళ్ల కితం తమిళ బిగ్ స్టార్ థలా అజిత్ ప్రెజెన్స్ ఉంటుంది అని అలాగే నీల్ అజిత్ తో ఓ సినిమా చేస్తాడు అన్నట్టుగా గట్టి రూమర్స్ వినిపించాయి. కానీ లేటెస్ట్ గా వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అజిత్ కేజీఎఫ్ చాప్టర్ 2 లో డైలాగ్స్ పేల్చడం మంచి ఆసక్తిగా మారింది.
దీనితో ఇక్కడ నుంచి మళ్ళీ కేజీఎఫ్ 3 పై డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. పార్ట్ 3 లో థలా ఉండొచ్చు అనే మాటలు మళ్ళీ మొదలయ్యాయి. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో కానీ ఒకవేళ నిజం అయితే మాత్రం దాని ఇంపాక్ట్ గట్టిగానే ఉంటుందని తెలుస్తుంది.
The post కేజీఎఫ్ లో అజిత్! first appeared on Andhrawatch.com.