మలయాళ చిత్రాలకు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే నమ్మకంతో మలయాళంలో తెరకెక్కిన ‘ఐడెంటిటీ’ అనే సినిమా తెలుగులో వారం రోజుల క్రితం విడుదల అయ్యింది. ఈ సినిమాలో టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్ ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేశారు. ఈ సినిమా ప్రేక్షకుల్లో బజ్‌ని క్రియేట్ చేయడంలో వెనకపడినట్లు తెలుస్తుంది.
అయితే, ఈ సినిమా ఇప్పుడు కేవలం 7 రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్దమయ్యింది.మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా అక్కడ జనవరి 2న థియేట్రికల్ విడుదల అయ్యింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 లో స్ట్రీమింగ్‌కు సిద్దమయ్యింది.
జనవరి 31 నుంచి ఈ సినిమా మలయాళంతో పాటు తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.ఇలా తెలుగులో జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఐడెంటిటీ కేవలం 7 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేవలం 7 రోజుల కోసమే థియేట్రికల్ రిలీజ్ ఎందుకు చేశారా అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
The post కేవలం వారం రోజుల్లోనే! first appeared on Andhrawatch.com.