టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజాగా మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. మరి తన కెరీర్ లో సరికొత్త మేకోవర్ తో మరో యువ హీరో కాంబోతో సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత స్వాతిసుధీర్ నిర్మిస్తున్న సినిమానే “రామ్ భజరంగ్” చిత్రం. సి.హెచ్.సుధీర్ రాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మరి మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యింది, దసరా సందర్భంగా రామ్ భజరంగ్ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చింది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం చూసేందుకు మంచి మాస్ గా కనిపిస్తుండగా ఇద్దరు హీరోలు రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ చాలా డిఫరెంట్ లుక్స్ , గెటప్స్ లో ఉన్నారు. మెయిన్ గా రాజ్ తరుణ్ నుంచి ఇది ఉహించని లుక్ అనే చెప్పుకొవచ్చు. ఇక ఈ సినిమాలో గదర్ 2 హీరోయిన్ సిమ్రత్ కౌర్, బిచ్చగాడు ఫేమ్ సట్న టీటస్, ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్ హీరోయిన్స్ గా చేస్తున్నారు.
అలాగే ఈ సినిమాలో ధనరాజ్, రచ్చ రవి, ఐశ్వర్య రాజా రవీంద్ర, రవి శంకర్, షఫీ, శివరామరాజు వెంకట్, సత్యం రాజేష్, ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
The post కొత్త అవతారంలో! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
