మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా “మిస్టర్ బచ్చన్” థియేటర్స్ నుంచి ఇపుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. మరి ఈ సినిమా తర్వాత ఊహించని విధంగా రవితేజకి చిన్న ప్రమాదం జరిగిన విషయం గురించి అందరికీ తెలిసిందే.
దీంతో అప్పుడు కొంచెం ఆందోళనకి లోనైన అభిమానుల కోసం రవితేజ స్వయంగా ట్వీట్ చేయడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇప్పుడు ఫైనల్ గా రవితేజ బయటకి కనిపించిన విజువల్స్ కొన్ని బయటకు వచ్చాయి. రవితేజ పరిచయం చేసిన ఎందరో దర్శకుల్లో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, బాలయ్యలతో చిత్రాలు చేసే రేంజ్ కి వచ్చిన కొల్లి బాబీ ఒకరు.
మరి బాబీ ఇండస్ట్రీ లోకి వచ్చి 10 ఏళ్ళు అయిన సందర్భంగా రవితేజ మీట్అయిన ‘పవర్’ఫుల్ ఫ్రేమ్ వైరల్ గా మారింది. మరి ఇందులో రవితేజ చేతికి కట్టు కనిపిస్తుండగా యాక్సిడెంట్ తర్వాత బయటకి వచ్చారు అంటే నెమ్మదిగా తాను కోలుకుంటున్నారని చెప్పాలి. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
The post కోలుకుంటున్న మాస్ మహారాజా! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
