కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌! | CineChitram

టాలీవుడ్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ సినిమాల్లో యంగ్‌ హీరో , గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతుంది

 దర్శకుడు శంకర్ ఈ సినిమాతో సాలిడ్ కమ్‌బ్యా్క్ ఇచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా విడుదలకు ఇంకా 50 రోజులు మాత్రమే ఉందని కౌంట్‌డౌన్ మొదలు పెట్టింది చిత్ర బృందం.

ఈ క్రమంలో ఓ సరికొత్త పోస్టర్‌తో ఈ కౌంట్‌డౌన్‌ను మొదలు పెట్టింది. సైకిల్‌పై రామ్ చరణ్ వెళ్తున్న ఈ పోస్టర్ ‘రంగస్థలం’ను గుర్తుకు చేస్తుందని అభిమానులు మరింత థ్రిల్ అవుతున్నారు. ఆ సినిమా ఎలాంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుందో, ఈ ‘గేమ్ ఛేంజర్’ అంతకు మించిన విజయాన్ని అందుకోవడం ఖాయమని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ సినిమాలో కియారా అద్వానీ, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి ముఖ్య పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

The post కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

Vishwak Sen’s female look from Laila unveiled | CineChitram

Mass Ka Das Vishwak Sen has garnered a separate fan base in the youth and …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading