టాలీవుడ్ అందరి ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం”. మరి 300 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్న ఈ సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓటిటి రిలీజ్ మంచి ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే. అలాగే దీనికంటే ముందే మార్చ్ 1న సినిమా గ్రాండ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగులో వచ్చేస్తుంది అని కన్ఫర్మ్ అయ్యింది.
అయితే ఇది వచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే జీ5 లో సినిమా స్ట్రీమింగ్ కి వస్తుంది అని తెలిసింది. కానీ ఇపుడు ట్విస్ట్ ఏమిటంటే టీవీ ప్రీమియర్ రోజునే అంటే మార్చ్ 1 నే ఓటిటిలో కూడా వచ్చేస్తుంది అని స్ట్రాంగ్ బజ్ ఇపుడు వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు, శిరీష్ లు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
The post క్రేజీ ట్విస్ట్! first appeared on Andhrawatch.com.