ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి రానున్న అతి పెద్ద ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కాంబో లో తెరకెక్కిస్తున్న సినిమా అనే చెప్పుకొవచ్చు. మరి ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాకి జక్కన్న అండ్ టీం ఒక ఊహించని విజువల్ అడ్వెంచర్ వండర్ గా సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా పై పక్కాగా ఈ డిసెంబర్ లో అఫీషియల్ అప్డేట్ అయితే ఒకటి రాబోతుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ కావడంతో RRR కి మించి విజువల్ ఎఫెక్ట్స్ అలాగే యానిమల్ సీక్వెన్స్ లు ఎక్కువే ఉంటాయి అనే టాక్ నడుస్తుంది. మొత్తానికి అయితే ప్రపంచమే షాకయ్యే క్రేజీ ప్రాజెక్ట్ టాలీవుడ్ నుంచి రాబోతుంది అని చెప్పాలి.
The post క్రేజీ ప్రాజెక్టు పై ఇంట్రెస్టింగ్ టాక్! first appeared on Andhrawatch.com.