“గజినీ 2” పై ఇంట్రెస్టింగ్ బజ్‌! | CineChitram

కోలీవుడ్ సినిమా స్టార్ హీరోస్ లో టాలెంటెడ్ యాక్టర్‌ సూర్య కూడా ఒకరు. మరి సూర్య హీరోగా నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అందులోని కొన్ని ఐకానిక్ సినిమాల్లో “గజినీ” కూడా ఒక మూవీ. దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కాంబోలో చేసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. అలాగే ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చెయ్యగా అక్కడ రికార్డు వసూళ్లు కొల్లగొట్టింది.

స్టార్ హీరో అమీర్ ఖాన్ తో ఏ ఆర్ మురుగదాస్ నే చేసిన ఈ సినిమాకి సీక్వెల్ పై కొన్నాళ్ల కితం పలు రూమర్స్ కూడా వినిపించాయి. అలాగే ఈ రూమర్స్ ఇపుడు నిజం అయ్యేలా ఉన్నాయని సమాచారం. మురుగదాస్ తమిళ్ సహా హిందీలో గజినీ 2 తియ్యనున్నారనే వార్త వైరల్‌ గా మారింది.

అలాగే సూర్య కూడా హింది గజినీ పార్ట్ 2లో అమీర్ తో కనిపిస్తాను అని కంగువా హిందీ ప్రమోషన్స్ లో భాగంగా తెలిపినట్టుగా ఓ స్టేట్మెంట్ కూడా వైరల్ అవుతుంది. మరి ఈ క్రేజీ సీక్వెల్ పై త్వరలోనే మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.

The post “గజినీ 2” పై ఇంట్రెస్టింగ్ బజ్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

Ram Charan’s interesting comments on Game Changer | CineChitram

The global star Ram Charan has joined forces with the visionary director Shankar for a …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading