బాలీవుడ్ నటి తాప్సీ పన్ను నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ హసీన్ దిల్‌రూబాకు సీక్వెల్ అయిన ఫిర్ ఆయీ హస్సీన్ దిల్‌రూబాలో చివరిసారి మెరిసింది. అయితే మొదటి భాగంలాగా ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు, తాప్సీ మరొక నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ కోసం చిత్ర రచయిత్రి కనికా ధిల్లాన్‌తో మరోమారు కలిసింది.
గాంధారి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని టీజర్‌తో అధికారికంగా ధృవీకరించింది. దేవాశిష్ మఖిజా డైరెక్షన్ చేస్తున్నారు. కనికా ధిల్లాన్ తన బ్యానర్, కథా పిక్చర్స్‌పై ఈ సినిమాని నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలు త్వరలో బయటకు రానున్నట్లు సమాచారం.
The post గాంధారిగా సొట్టబుగ్గల సుందరి! first appeared on Andhrawatch.com.