తెలుగు చిత్ర పరిశ్రమలో నటనతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుల్లో సుహాస్ ఒకరు. ఆయన తాజాగా ‘గొర్రె పురాణం’
సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. అయితే, ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఏర్పడింది. కాగా, ఈ ఆసక్తికి క్లారిటీ ఇచ్చేలా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
ఓ గొర్రె చుట్టూ ఈ సినిమా కథ సాగుతుండగా.. రెండు మతాల మధ్య ఈ గొర్రె ఎలాంటి వివాదాలను రేపింది.. అసలు ఈ గొర్రె కథ ఏమిటి.. మధ్యలో సుహాస్ పాత్ర ఏమిటనేది ఈ సినిమా స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ట్రైలర్ కట్ ఆద్యంతం సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.
ఇక సుహాస్ ఎప్పటిలాగే ఈసారి మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో రాబోతున్నాడని ఈ ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. ఈ మూవీని బాబీ డైరెక్ట్ చేస్తుండగా విషిక ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. సినిమాను సెప్టెంబర్ 20న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దంగా ఉన్నారు.
The post గొర్రె పురాణం..వినాల్సిందే మరి! first appeared on Andhrawatch.com.