తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘ది గోట్’ మూవీ మరికొద్ది గంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు పూర్తి స్పై సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై చిత్ర యూనిట్ భారీ అంచనాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో ఓ క్రికెటర్ నటిస్తున్నాడనే విషయం కోలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా వినిపిస్తున్న టాక్.
తాజాగా ఆ వార్తను నిజం చేస్తూ మాజీ ఇండియన్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఈ సినిమా గురించి ఓ పోస్ట్ చేశాడు. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ముగించినట్లుగా ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దీంతో తమిళ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది.
బద్రీనాథ్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే
The post గోట్ లో చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్! first appeared on Andhrawatch.com.