చెల్లిని మించిన అందం అక్కది! | CineChitram

సీతారామం సినిమాలో సీతామహలక్ష్మి క్యారెక్టర్‌ తో తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తన వైపునకు తిప్పుకుంది ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌. ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్ని కూడా మంచి టాక్‌ ని అందుకున్నాయి. ప్రస్తుతం తెలుగు, హిందీలో వరుస సినిమాల చేస్తూ దూసుకుపోతుంది. మృణాల్ ఇటీవల హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్స్ లో మృణాల్‌ కూడా ఒకరు.

అయితే మృణాల్ బయట, సినిమాల్లో అంత అందంగా కనిపించడానికి వెనుక ఉన్నవారు ఎవరో తెలుసా?మృణాల్ ఠాకూర్ అందానికి కారణం తన అక్క లోచన్ ఠాకూర్. లోచన్  మేకప్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ గా సినీ ఇండస్ట్రీలో రాణిస్తుంది. మృణాల్ మొదటి సినిమా నుంచి కూడా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు మృణాల్ ఠాకూర్ కి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ గా ఆమె అక్కనే పని చేస్తుంది.

 సీతారామం, ఇటీవల హాయ్ నాన్న సినిమాల్లో మృణాల్ ని అంత అందంగా చూపించింది తన అక్క లోచన్ ఠాకూర్ నే.అలాగే మృణాల్ కి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ గా కూడా లోచన్ ఠాకూర్ పని చేస్తుంది. అంతే కాకుండా బాలీవుడ్ లో సినిమాలకు మేకప్ ఆర్టిస్ట్ గా, పలువురు సెలబ్రిటీలకు కూడా పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుంది లోచన్ ఠాకూర్. గతంలో పలు మార్లు మృణాల్ తన అక్కతో దిగిన ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు లోచన్ ఠాకూర్ పుట్టిన రోజు కావడంతో మృణాల్ తన అక్కతో కలిసి చిన్నప్పుడు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది.

The post చెల్లిని మించిన అందం అక్కది! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …