మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయ్యిన ఈ చిత్రం ఇపుడు జపాన్ దేశంలో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.
అయితే మార్చ్ లో ఈ సినిమా అక్కడ రిలీజ్ కాబోతుండగా ఇపుడు జపాన్ వెర్షన్ ట్రైలర్ ని మేకర్స్ వదిలారు. ఇక ఇదిప్పుడు ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా మారింది. మరి ఈ ట్రైలర్ ని అక్కడి ఆడియెన్స్ కి ఇంకా కనెక్ట్ అయ్యే విధంగా కట్ చేసారని చెప్పాలి. ఎర్ర సముద్రం వారి తెగపై కథని వివరిస్తూ స్టార్ట్ అయ్యిన ఈ ట్రైలర్ చాలా వరకు అనిరుద్ సంగీతం లేకుండా వారి స్టైల్ వాయిస్ ఓవర్ తో కనిపించింది.
లాస్ట్ లో దేవర థీమ్ తో మంచి ఎగ్జైటింగ్ గానే కట్ చేశారు. మరి తెలుగు ఒరిజినల్ వెర్షన్ లోనే జపాన్ సబ్ టైటిల్స్ తో ఈ చిత్రం అక్కడ మార్చ్ 28న నేషనల్ వైడ్ రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ సహా కొరటాల శివ కూడా జపాన్ లో ల్యాండ్ కానున్నారు.
The post జపాన్ ట్రైలర్ ఎలా ఉందో తెలుసా! first appeared on Andhrawatch.com.