జాక్ ట్రైలర్‌ ముహుర్తం కుదిరింది! | CineChitram

స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాక్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందింది. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఈ క్రమంలో ఈ చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 2న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించారు.

దీంతో ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాలో సిద్ధు పాత్ర ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోండగా బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

The post జాక్ ట్రైలర్‌ ముహుర్తం కుదిరింది! first appeared on Andhrawatch.com.

About

Check Also

Producer Naga Vamsi Fires at Some Website Reviewers, Challenges Media: Ban Me and My Films | CineChitram

Producer Naga Vamsi recently delivered a box office success with the latest release ‘Mad Square,’ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading