బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా మన టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో చేస్తున్న అవైటెడ్ చిత్రమే “జాట్”. హిందీలో తెరకెక్కించిన ఈ చిత్రంపై సాలిడ్ హైప్ కూడా నెలకొంది. ఇక రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో మరిన్ని అంచనాలు కూడా పెరిగాయి. మరి ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫైనల్ గా ఫస్ట్ సింగిల్ ని అనౌన్స్ చేశారు. అయితే ఈ ఫస్ట్ సింగిల్ గా మేకర్స్ ఒక ఐటెం సాంగ్ ని అనౌన్స్ చేయడం విశేషం.
మరి ఈ సాంగ్ లో కనిపించే బ్యూటీని ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంచారు కానీ టచ్ కియా అంటూ ఈ సాంగ్ సాగుతుంది అని రివీల్ చేశారు. ఇక థమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని అయితే ఈ ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఐటెం సాంగ్స్ లో థమన్ కి సెపరేట్ ట్రాక్ రికార్డు ఉంది. మరి పాన్ ఇండియా ఆడియెన్స్ ని ఈ సాంగ్ అలరిస్తుందో లేదో చూడాలి మరి. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.
The post జాట్ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే! first appeared on Andhrawatch.com.