టీజర్ డేట్ వచ్చేసింది! రీసెంట్ గా మన తెలుగు సినిమా యువతని ఎంతగానో మెప్పించిన టాలీవుడ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ లో ఒక మ్యాడ్ రైడ్ చిత్రం “మ్యాడ్” కూడా ఒకటి. నార్నె నితిన్, రామ్ నితిన్ అలాగే సంగీత్ శోభన్ ల కలయికలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా “మ్యాడ్ స్క్వేర్” ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసి దాని రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు. అయితే ఈ చిత్రం నుంచి ఇపుడు టీజర్ ట్రీట్ కి డేట్ ఫిక్స్ అయ్యింది. మేకర్స్ ఈ సినిమా తాలూకా టీజర్ ని ఈ ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తున్నట్టుగా లీడ్ హీరోస్ పై క్రేజీ పోస్టర్ తో రివీల్ చేశారు. మరి లాస్ట్ టైం కూడా టీజర్ తోనే మేకర్స్ మంచి బజ్ రేపారు. ఇక ఈ సాలిడ్ సీక్వెల్ టీజర్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ మార్చ్ 29న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
The post టీజర్ డేట్ వచ్చేసింది! first appeared on Andhrawatch.com.