ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా దీనిని తెరకెక్కిస్తుండగా ఈ సినిమా కోసం రామ్ చరణ్ సాలిడ్ లుక్ ని కూడా సిద్ధం చేసాడు. అయితే ఈ లుక్ పట్ల మొదటి నుంచి మెగా అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్న సంగతి తెలిసిందే.
మరి లేటెస్ట్ గా ఇదే లుక్ లో గ్లోబల్ స్టార్ ఓ ఈవెంట్ లో కనిపించి ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చాడు. మరి ఫంక్షన్ నుంచే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ కూడా వెళ్లారు. ఇలా మహేష్ సతీమణి నమ్రత షేర్ చేసుకున్న పిక్స్ ఇపుడు వైరల్ గా మారాయి. మరి వీటిలో మహేష్ కుటుంబం రామ్ చరణ్ కుటుంబంతో కూడా కనిపించగా ఇందులో చరణ్ మంచి డైనమిక్ లుక్ లో అదరగొట్టాడు అని చెప్పాలి. ఆల్రెడీ కొన్ని వీడియో విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇపుడు ఈ పిక్ బ్యూటిఫుల్ మూమెంట్ గా మారింది.
The post డాషింగ్ లుక్ లో చరణ్! first appeared on Andhrawatch.com.