మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా, మాస్ యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “దేవర” గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ అభిమానులు సహా మాస్ ఆడియెన్స్ ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ సాలిడ్ ప్రమోషన్స్ ని పాన్ ఇండియా భాషల్లో రూపుదిద్దుకుంటుంది. అయితే మేకర్స్ తారక్ పై పలు కొత్త కొత్త పోస్టర్స్ స్టిల్స్ కూడా చిత్ర బృందం విడుదల చేస్తున్నారు. ఇలా తాజాగా వచ్చిన కొన్ని పిక్స్ చాలా వైరల్ గా మారాయి. “దేవర” లుక్స్ లో కనిపిస్తున్న తారక్ మంచి డైనమిక్ గా అలాగే పవర్ఫుల్ పాత్రగా కనిపిస్తున్నాడు.
దీంతో సినిమాలో మాత్రం తారక్ ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ ని ఇవ్వబోతున్నాడనే తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. అలాగే ఈ భారీ సినిమా ఈ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ గా విడుదలకు రెడీగా ఉంది.
The post డైనమిక్ లుక్ లో అదరగొట్టిన తారక్! first appeared on Andhrawatch.com.