ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. ఐతే, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ని ఎంపిక చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్’ అని ప్రచారంలో ఉంది. ఐతే, ‘డ్రాగన్’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట.
అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఆ మధ్య ఈ సినిమా గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘ఆడియన్స్ ఊహించని స్థాయిలో ఈ మూవీని తీస్తున్నాను. ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్’ సినిమా గురించి నిత్యం ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది.
The post డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్! first appeared on Andhrawatch.com.