డ్రాగన్‌ -మరో ఇద్దరి కోసం కసరత్తులు! | CineChitram

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రాబోతున్న కొత్త సినిమా పై రోజుకొక వార్త వినిపిస్తోంది. ఈ మూవీ అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన టాక్ బయటికి వచ్చింది. ఇందులో ప్రత్యేకంగా ఓ క్యారెక్టర్‌ను డిజైన్ చేస్తున్నారని, ఆ పాత్రను హిందీ వెర్షన్‌లో ఒక బాలీవుడ్ హీరోతో, తమిళ వెర్షన్‌లో ఒక కోలీవుడ్ స్టార్‌తో చేయించాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని సమాచారం. మరి ఆ హీరోలు ఎవరో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.

ఇక టైటిల్ విషయానికి వస్తే, ఈ సినిమాను ‘డ్రాగన్‌’ అనే పేరుతో ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత గ్రాండ్ సినిమా కావాలని ప్రశాంత్ నీల్ కసరత్తు చేస్తున్నాడట. అందుకే ఆయన స్క్రిప్ట్ పనికి ఎక్కువ సమయం కేటాయించారని, ఇంతవరకు తన చేసిన సినిమాలన్నింటికంటే ఇది ప్రత్యేకంగా ఉండబోతుందని టాక్.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …