టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఇపుడు నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “కింగ్డమ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చేస్తున్న పక్కా మాస్ అండ్ భారీ ప్రాజెక్ట్ ఇది కాగా రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ తో హైప్ నెక్స్ట్ లెవెల్లోకి ఈ సినిమాకి వెళ్ళిపోయింది. అయితే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తవుతుండగా లేటెస్ట్ అప్డేట్ అయితే దీనిపై తెలుస్తుంది.
దీని ప్రకారం కింగ్డమ్ షూటింగ్ ఇపుడు అంతిమ దశకి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మేకర్స్ లేటెస్ట్ గా వైజాగ్ లో ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేశారట. ఈ షెడ్యూల్ మార్చ్ మొదటి వారం వరకు కొనసాగనుండగా అక్కడితో సినిమా మొత్తం కంప్లీట్ అవుతుంది అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సాలిడ్ వర్క్ అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ మే 30న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
The post తాజా సమాచారం ఏంటంటే! first appeared on Andhrawatch.com.