‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ? అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ ను అట్లీ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ను కలవనున్నారంట మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. మొత్తానికి ఈ సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా, ఈ సినిమాకి సంబంధించి లీకుల రూపంలో చాలా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే, ఈ సినిమా ఉందనే విషయాన్ని నిర్మాత రవిశంకర్ ఆ మధ్య పరోక్షంగా వెల్లడిస్తూ.. త్వరలోనే అట్లీతో బన్నీ సినిమా చేస్తారని, ఆ తర్వాత త్రివిక్రమ్ మూవీ ఉంటుందని.. ఆ 2 సినిమాలు పూర్తయిన తర్వాత పుష్ప-3 వస్తుందని రవిశంకర్ చెప్పుకొచ్చారు. అన్నట్టు ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ ఊహించని విధంగా ఉంటుందని ముందు నుంచి వినపడుతున్న మాట. ప్రస్తుతం బన్నీ ఆ లుక్ కోసం కసరత్తులు చేస్తున్నారట. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
The post తాజా సమాచారం ఏంటంటే! first appeared on Andhrawatch.com.