మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్-2’ చిత్ర షూటింగ్‌ను ముగించుకుని.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఇటీవల ‘దేవర’ చిత్రం జపాన్‌లో గ్రాండ్ రిలీజ్ కావడంతో, అక్కడ ప్రమోషన్స్ చేసి ఇండియాకు తిరిగి వచ్చాడు తారక్. ఇక తాజాగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ సక్సెస్ మీట్‌కు ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు.
‘మ్యాడ్ స్కేర్’ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఎన్టీఆర్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. తన నెక్స్ చిత్రాల్లో నిర్మాత సూర్యదేవర నాగవంశీతో ఓ సినిమా చేయబోతున్నానని.. ఇది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని.. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ త్వరలోనే నాగవంశీ చేస్తాడని.. తారక్ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో ఉండబోతుందనే టాక్ కన్ఫర్మ్ అయ్యింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ తన నెక్స్ట్ చిత్రం నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఉంటుందని.. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో ఉంటాడని నాగవంశీ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను కన్ఫర్మ్ చేస్తూ ఎన్టీఆర్ ఈ సినిమాపై అప్డేట్ ఇచ్చినట్లు స్పష్టమైంది.
The post తారక్ ఆ సినిమా గురించి ఏం చెప్పాడంటే! first appeared on Andhrawatch.com.