మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తాజాగా నటించిన మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ సినిమా “దేవర”. ప్రస్తుతం గ్లోబల్ వైడ్ గా దేవర మ్యానియా కనిపిస్తుంది. భారీ ప్రమోషన్స్ ని దేశ వ్యాప్తంగా మేకర్స్ చేస్తుండగా అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు తారక రాముడి మాస్ ఆగమనంని బిగ్ స్క్రీన్స్ పై చూద్దామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ భారీ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ తాజాగా చెప్పిన కొన్ని విషయాలను చూస్తే సినిమా పై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయని చెప్పాలి. ఇప్పుడు వరకు ఈ చిత్రంలో కేవలం ఒక్క పాత్రే ఇద్దరు ముగ్గురుగా కనిపిస్తాడు అని లేదా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో అన్నదమ్ములుగా కనిపిస్తాడు అంటూ చాలానే కన్ఫ్యూజన్ నడుస్తుంది.
కానీ తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ “దేవర” అనేది తండ్రి పాత్ర “వర” అనేది కొడుకు పాత్ర అంటూ సినిమాలో ఆ రెండు రోల్స్ తాను చేసినట్టుగా అభిమానులకు చెప్పేశాడు. దీంతో ఓ కన్ఫ్యూజన్ పోయింది అని చెప్పాలి. అలాగే దేవర పాత్రకి తాను రెడీ అయిన విధానం గురించి కూడా చాలా ఎగ్జైట్ అవుతూ తారక్ చెప్పుకొచ్చాడు. దీంతో ఇవన్నీ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. మరి దేవర తో ఎన్టీఆర్ ఎలాంటి ట్రీట్ ని అభిమానులకి అందించనున్నాడో చూడాల్సిందే.
The post తారక్ ఏం చెప్పాడంటే..! first appeared on Andhrawatch.com.