యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, మాస్ యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న దేవర సినిమా సెప్టెంబర్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఒక పక్క జనతా గ్యారేజ్ చిత్రం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ తాజాగా వెల్లడించారు..
“మా జనతా గ్యారేజ్‌కి 8 సంవత్సరాలు. మా డియరెస్ట్ కాంబో అయిన ఎన్టీఆర్ , శివ దేవరతో ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసం సృష్టించడానికి రెడీ గా ఉన్నారు. మరి కొన్ని నెలల్లో సునామీ సృష్టించడానికి #NTRNeel షూటింగ్ మొదలు పెడుతున్నాం” అని మైత్రి మూవీ మేకర్స్ వారు సోషల్ మీడియాలో తెలియజేశారు. అయితే ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ లు కలిసి ఉన్న ఒక ఫోటో ను లిఖితా రెడ్డి నీల్ షేర్ చేయగా, ఆ ఫోటోను కూడా జతపరిచారు. ఈ పోస్ట్ కొద్ది సేపటికే వైరల్ గా మారింది.
The post తారక్ నీల్ సినిమా ఎప్పుడంటే! first appeared on Andhrawatch.com.