దాని కోసం స్పెషల్ సెట్! శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ ‘రాహుల్ సంకృత్యాన్’ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమా షూట్ ఈ నెల నాలుగో వారం నుంచి మొదలు కానుందని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్స్ ను షూట్ చేసినట్లు తెలుస్తుంది. ఎంట్రీ సన్నివేశాల షూట్ కోసం ప్రత్యేకంగా ఓ సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సీన్స్ సినిమా మొత్తానికే హైలైట్ గా ఉంటాయట. ఇక, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పూర్తిగా సరికొత్త గెటప్ లో కనిపిస్తాడని.. ముఖ్యంగా విజయ్ లుక్ చాలా కొత్తగా ఉంటుందని ఓ టాక్ నడుస్తుంది. కాగా, 1854-78 మధ్య కాలంలో జరిగే కథ కాబట్టి, సినిమాలో చాలా వేరియేషన్స్ ఉంటాయని సమాచారం.
పైగా ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఆయన ఈ సినిమాలో నటిస్తే కచ్చితంగా ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. ఎంతైనా ‘రాహుల్ సంకృత్యాన్’ డైరెక్షన్ లో నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. దీంతో, విజయ్ దేవరకొండ సినిమా పై కూడా భారీ అంచనాలు ఏర్పరచుకుంది.
The post దాని కోసం స్పెషల్ సెట్! first appeared on Andhrawatch.com.