మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ సినిమా ‘మెకానిక్ రాకీ’ ఫస్ట్ గేర్, పాటలతో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. తాజాగా మేకర్స్ ఈ రోజు ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 1.0 ని లాంచ్ చేశారు. శ్రీరాములు థియేటర్లో భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
ట్రైలర్ లో మెయిన్ క్యారెక్టర్స్ పరిచయం చేస్తూ సినిమా యాక్షన్ ప్యాక్డ్ హ్యామరస్ గా ఉంటుందని ప్రామిస్ చేసింది. రాకీ చదువులో ఫెయిల్ అయిన తర్వాత, తన తండ్రి మెకానిక్ షాప్ ని టేకోవర్ చేసుకొని, లేడిస్ కోసం డ్రైవింగ్ స్కూల్‌ను మొదలు పెడతాడు. హీరోయిన్స్ పాత్రలు పోషించిన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ లని ఫ్లర్ట్ చేస్తుంటాడు. పవర్ ఫుల్ మ్యాన్ సునీల్ తో తలపడటం క్యురియాసిటీని పెంచింది.
ట్రైలర్ లో యాక్షన్, హ్యుమర్, రొమాన్స్, మాస్ అన్నీ ఎలిమెంట్స్ అద్భుతంగా పండాయి. డైలాగులు ప్రేక్షకులను అలరించాయి. రవితేజ ముళ్లపూడి తన డైరెక్షన్‌తో ఆకట్టుకున్నాడు. విశ్వక్ సేన్ హ్యుమర్, చరిష్మా తో స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేశాడు. మీనాక్షి చౌదరి క్లాసిక్, ట్రెడిషినల్ గా పాత్రలో మెరిసింది. శ్రద్ధా శ్రీనాథ్ మోడరన్ అమ్మాయి పాత్రలో నటించింది.
The post దూసుకెళ్తున్న విశ్వక్ మెకానిక్ రాకీ! first appeared on Andhrawatch.com.